మానస సరోవర్ లో హైదరాబాదీల నరకయాతన!

  • 40 మంది యాత్రికులు మానస్ సరోవర్ కు పయనం
  • సదరన్ ట్రావెల్స్ ద్వారా ప్రయాణం
  • అనూహ్యంగా చిక్కుకుపోయిన వైనం
చైనా, నేపాల్ సరిహద్దు ప్రాంతంలో హిమాలయా సానువుల్లో కొలువుదీరిన మానస సరోవర్ ప్రముఖ పర్యాటక ప్రాంతం అని తెలిసిందే. అయితే, ఇక్కడికి సరైన జాగ్రత్తలు తీసుకోకుండా వస్తే ఎన్నో ఇక్కట్లు పడాల్సి ఉంటుంది. ఇప్పుడు కొందరు హైదరాబాదీలు కూడా మానస సరోవర్ లో చిక్కుకుపోయి నరకయాతన అనుభవిస్తున్నారు.

హైదరాబాద్ కు చెందిన 40 మంది వ్యక్తులు ఈ నెల 13న మానస సరోవర్ కు వెళ్లారు. వారంతా సదరన్ ట్రావెల్స్ సంస్థ ద్వారా అక్కడికి చేరుకున్నారు. అయితే, అక్కడికి వెళ్లిన హైదరాబాదీలు అనూహ్యరీతిలో చిక్కుకుపోయారు. అక్కడి వాతావరణం సరిపడక వారిలో కొందరు అస్వస్థత పాలయ్యారు. తమను కాపాడాలంటూ కొన్ని వీడియోల ద్వారా కుటుంబ సభ్యులకు సందేశాలు పంపారు. వారిలో కొందరు కన్నీటిపర్యంతమయ్యారు. ట్రావెల్స్ యాజమాన్యం తమ గురించి పట్టించుకోవడం లేదని సదరు యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
Manas Sarovar

More Telugu News